Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు..

పండుగలు మత సామరస్యానికి ప్రతీకలు..

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని సర్పంచ్ పన్యాల ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్ర వారం మండలంలోని పెద్ద మసాన్ పల్లి గ్రామంలో ముస్లింలకు రంజాన్ తోపా కిట్లు  పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 10సంవత్సరాలుగా రంజాన్ తోపా కిట్లు పంపిణి చేస్తున్నామన్నారు. ఈ తోఫా కిట్లు వారి ఉపవాస దీక్షలలో ఉపశమనాన్ని కలిగిస్తాయని తెలిపారు.

పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని, అందరు కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయిన శ్రీని వాస్, వార్డు సభ్యులు అంబిగళ్ళ కిషన్, తాళ్ల స్వామి, బెల్లరాజు బిఆర్ఎస్ నాయ కులు పన్యాల మధుసూదన్ రెడ్డి, బోయిని రాములు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -