పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి

నవతెలంగాణ రాజంపేట్
పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సిఐ తిరుపతయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణము నిర్వహించిన శాంతియుత సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక చవితి సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల వివరాలు పోలీసులకు అందించాలని, విగ్రహాల నిమజ్జనం లో భాగంగా శాంతియుతంగా నిమర్జనం చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఎస్సై సంపత్ మాట్లాడుతూ… ప్రధాన కూడల్లో వహనాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంత వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నల్లవెల్లి అశోక్, సీనియర్ నాయకులు ఆముదాల నాగరాజు, అంద్యాల రమేష్, నరేష్, ఏఎస్ఐ గంగారెడ్డి గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love