నవతతెలంగాణ – పెద్దకొడప్ గల్
రాష్ట్రంలో అకాల భారీ వర్షాలు కురవడంతో పెద్దకొడప్ గల్ మండల కేంద్రంతో పాటు మండలంలో అన్ని గ్రామాల్లో సుమారుగా 1000 నుంచి 1500 ఎకరాల పంట నష్టం జరిగినట్టు భారతీయ కిసాన్ సంఘం మండల అధ్యక్షులు బస్వరాజ్ దేశాయ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో దెబ్బతిన్న పంటలను కిసాన్ సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం మండల అధ్యక్షుడు బస్వరాజ్ దేశాయ్ మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల అప్పు సప్పు చేసుకుని పండించిన పంటలు నష్టపోవడం దారుణమని, రైతాంగం కష్టాల్లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారుల చేత శీతల స్థాయిలో సర్వే చేయించి వెంటనే పంట నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సూచించారు.
కిసాన్ సంఘం సభ్యులు తానాజీ రావు వ్యవసాయ శాఖ మండల అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ … రైతులు చాలా ఇబ్బందుల్లో, ఎలాంటి నిర్లక్ష్యం తొందరగానే వ్యవసాయ శాఖ అధికారుల చేత సర్వే చేయించి నష్టపోయిన పంట వివరాలను ఉన్నత సాయి అధికారులకు నివేదిక అందించాలని కోరారు. అదేవిధంగా దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించకపోతే భారతీయ కిసాన్ సంఘం దృష్టికి తీసుకొస్తే, వ్యవసాయ శాఖ అధికారులు దృష్టికి రైతులకు న్యాయం చేస్తామని సూచించారు. పార్టీలు వేరైనా, రైతులంతా ఒకటేనని, రైతు రైతుకి సహకారం అందించుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘం మండల అధ్యక్షులు బస్వరాజ్ దేశాయ్,పెద్ద కోడప్ గ్రామ కమిటీ అధ్యక్షులు కుమార్ సింగ్, మండల కార్యదర్శి బోడి రాజు యాదవ్, సహాయ కార్యదర్శి బోడి మళ్ళీకార్జున్, మండల ఉపాధ్యక్షులు జైత్రం, అఫ్రోజ్, జక్కుల అంజయ్య,జక్కుల శివరాం, దేవుసింగ్,కల్లూరి మహేందర్, జోగు హనుమాన్లు,బోడి పెంటయ్య యాదవ్,పాల్గొన్నారు.
దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES