Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిషరీస్ విద్యార్థుల క్షేత్ర సందర్శన.. వృత్తి శిక్షణ శిబిరం

ఫిషరీస్ విద్యార్థుల క్షేత్ర సందర్శన.. వృత్తి శిక్షణ శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫిషరీస్ విద్యార్థులు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా పోచంపాడు లోని జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ వృత్తి శిక్షణ కేంద్రం లో కేంద్రం ఫీల్డ్ ఆఫీసర్, అధ్యాపకులు శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ అవగాహన నిర్వహించారని కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేప విత్తనం పెంపకం, రక్షణ, హెచరీల నిర్మాణం, పెరిగిన చేపల పంపిణీ, మార్కెటింగ్, చైనీస్ హెచరీల పద్ధతి, రవాణా తదితర అంశాల్లో శిక్షణను ఇచ్చారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. విద్యార్థులకు ఈ అవగాహన తో భవిష్యత్ లో స్వయం ఉపాధిని పెంపొందించుకునే మెళకువలు పెంపొందుతాయనీ అన్నారు. వృత్తి విద్య కోర్సుల ద్వారా ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -