Saturday, March 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిజాంసాగర్‌ ఐదో విడత నీటి విడుదల

నిజాంసాగర్‌ ఐదో విడత నీటి విడుదల

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్‌
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం శుక్రవారం నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల ఐదవ విడత నీటిని లక్షా 25 వేల ఎకరాల పంటల సాగు కోసం 15 రోజుల పాటు అలీసాగర్‌కు వదులుతున్నట్టు ప్రాజెక్ట్‌ ఏఈఈ సాకేత్‌ తెలిపారు. కావున కాలువ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలువలోకి ఎవరూ దిగొద్దని సూచించారు. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గానూ ప్రస్తుతానికి ప్రాజెక్టులో 10.338 టీఎంసీల నీరు నిలువ ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -