- Advertisement -
- – స్నానాలకు, కాలకృత్యాలకూ తిప్పలు
నవతెలంగాణ- దుబ్బాక - దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో ప్రజలు గత 15 రోజులుగా తాగునీటి కోసం తల్లడిపోతున్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. గత 15 రోజులుగా తాగునీరు అరకొరగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు మంగళవారం ఖాళీ బిందెలు, బకెట్ల తో రోడ్డుపై నిరసన తెలిపారు. బోర్ మోటార్లలో కూడా సరిపడా నీళ్లు రావడంలేదని, దోమల బెడద ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
- స్నానాలకు, కాలకృత్యాలకూ తిప్పలు..
- నల్లా నీరు రాక వంట పనులు, స్నానాలకు, కాలకృత్యాలకు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే తమ గ్రామానికి మంచినీటిని సరఫరాను పునరుద్ధరించాలని గ్రామస్తులు సుధ, స్వప్న, లింగం, నిమ్మ రమేష్, నిమ్మ బూదయ్య, దుగ్గిరాములు, పలువురు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శి రవీందర్ ను వివరణ కోరగా, గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నుంచి వచ్చే మంచినీరు తమ గ్రామానికి సరిపడా రావడంలేదని, దీంతో గ్రామంలోని వాటర్ ట్యాంకులు సగం కూడా నిండడం లేదన్నారు. ఈ విషయమై ఎంపీడీవో, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. మరో మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు నాలుగు వాటర్ ట్యాంకర్లతో గ్రామంలో మంచినీటి సరఫరా చేస్తున్నామని కార్యదర్శి వెల్లడించారు.
- Advertisement -