Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజలకు న్యాయం కోసం పోరాడేదే ఎర్రజెండా: రమేశ్

ప్రజలకు న్యాయం కోసం పోరాడేదే ఎర్రజెండా: రమేశ్

- Advertisement -

 నవతెలంగాణ – వనపర్తి 
అణగారిన ప్రజలకు న్యాయం కోసం పోరాడేదే ఎర్రజెండా అని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ అన్నారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రం చండీగర్లో  సిపిఐ 25వ జాతీయ మహాసభల ప్రారంభం సందర్భంగా వనపర్తి సిపిఐ ఆఫీస్ వద్ద సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. సంఘీభావం తెలుపుతూ ఆఫీస్ వద్ద అరుణ పతాకాన్ని జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాజీ సర్పంచ్ కళావతమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో సిపిఐ కి వందేళ్ళ పోరాట చరిత్ర ఉందని, మరే పార్టీకి లేదన్నారు. స్వాతంత్ర్య పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ సాధన పోరాటంలో సిపిఐ కీలకపాత్ర పోషించిందన్నారు. దున్నేవాడికి భూమి, పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రుణమాఫీ, న్యాయమైన కూలి రైతుకు గిట్టుబాటు ధర నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధి కోసం పోరాడుతూ పేదల గొంతుకగా పనిచేస్తోందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలోపేదల కోసం చేసిందేమి లేకపోగా వారి హక్కులను హరించిందన్నారు.

లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులను, నల్ల సాగు చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందులు పాలు చేసిందన్నారు. ఇప్పుడు రైతులకు యూరియా ఇవ్వకుండా వేధిస్తోందన్నారు. పేదరికం నిరుద్యోగంతో ప్రజలు అల్లాడుతుంటే గుడుల పేరుతో మతం పేరుతో రాజకీయం చేస్తోందని ప్రజలు సంఘటితమై తిప్పి కొట్టాలన్నారు.వందేళ్ళపోరాట చరిత్ర కలిగిన సిపిఐ బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతోందని ప్రజలు కలిసి రావాలని కోరారు.సిపిఐ 25వ జాతీయ మహాసభల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకులపై పోరాటానికి సిద్ధం కావాలని కోరారు.జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ,కృష్ణవేణి, గోపాలకృష్ణ,జయమ్మ,చిన్న కుర్మయ్య,లక్ష్మీనారాయణ, శివ,వంశీ,శిరీష,శ్రీదేవి,భూమిక, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -