మోడీ సర్కార్ కుట్రల్ని అడ్డుకుందాం : సీపీఐ(ఎం) అగ్రనేత బృందాకరత్
రాంచీ : గిరిజన హక్కులకోసం ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) అగ్రనేత బృందాకరత్ పిలుపునిచ్చారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్పొరేటీకరణ విధానాలతో అడవి బిడ్డలను అడవుల్లో ఉండకుండా తరిమివేస్తోందని విమర్శించారు. అంతకు ముందు రాంచీలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (నేషనల్ ఫోరం ఫర్ ట్రైబల్ రైట్స్) జాతీయ సమన్వయ కమిటీ (ఎన్‌సీసీ) నిర్వహించిన సమావేశంలో గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామికి బృందాకరత్ నివాళ్లు అర్పించారు. అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మోడీ సర్కార్ కుట్రల్ని అడ్డుకునేలా సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందన్నారు. ప్రజాహక్కుల కోసం జరిగే ఉద్యమాల్లో పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
గిరిజన హక్కుల కోసం పోరాటం
- Advertisement -
- Advertisement -

 
                                    