- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : అధికారం ఉన్న లేకున్నా ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందని బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్,నారా రమేష్,తాండ్ర మల్లేష్,ఇనుముల సతీష్ అన్నారు. గురువారం తాడిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తమ నాయకుడు, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ అధికారంలో ఉన్నప్పుడు భూ నిర్వాసితుల పక్షాన పోరాటం చేసి ఎకరాకు రూ.6.50 లక్షలు ఇప్పించారని తెలిపారు. అలాగే ఖమ్మంపల్లి నుంచి కిషన్ రావు పల్లి వరకు రోడ్లు నిర్మాణ పనులను మంజూరు చేయించారని తెలిపారు. మండల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి కాంగ్రెస్ నాయకులు అర్ధరహితమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు.
- Advertisement -