Tuesday, December 9, 2025
E-PAPER
Homeబీజినెస్దలాల్‌ స్ట్రీట్‌కు ఎఫ్‌ఐఐ సెగలు

దలాల్‌ స్ట్రీట్‌కు ఎఫ్‌ఐఐ సెగలు

- Advertisement -

– సెన్సెక్స్‌ 600 పాయింట్ల పతనం
– రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి
– ఇండిగో షేర్ల కుదేలు
ముంబయి :
భారత స్టాక్‌ మార్కెట్లపై విదేశీ మదుపర్లు ముఖం చాటేస్తోన్నారు. వరుస అమ్మకాలతో దలాల్‌ స్ట్రీట్‌కు సెగ లు పుట్టిస్తున్నారు. రూపాయి రికార్డ్‌ పతనం, భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పం దంపై సానుకూల సంకేతాలు కానరాక పో వడం, విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐ ఐ) అమ్మకాలతో సోమవారం సెన్సెక్స్‌, నిఫ్టీ లు కుప్పకూలాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ రోజ ంతా నష్టాల్లోనే కొనసాగి.. తుదకు 610 పాయింట్లు లేదా 0.71 శాతం పతనమై 85,103కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ ఈ నిఫ్టీ కూడా 226 పాయింట్లు లేదా 0.86 శాతం కోల్పోయి 25,961 వద్ద ముగిసింది.సెన్సెక్స్‌ ఓ దశలో 800 పాయి ంట్లకుపైగా నష్టపోయింది. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కె ట్‌ విలువ దాదా పు రూ.7 లక్షల కోట్లపైగా ఆవిరై రూ. 463 లక్షల కోట్లకు తగ్గింది. దీంతో ఒక్క పూటలోనే ఇన్వెస్టర్ల సంపద రూ.7లక్షల కోట్లు కరిగిపోయినట్లయ్యింది.

సెన్సెక్స్‌ 30సూచీలో టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ మినహా మిగిలిన 27 షేర్లూ ప్రతికూలతను చవి చూశాయి. బీఈఎల్‌, ఎటెర్నెల్‌, ట్రెంట్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ అధికంగా నష్టపో యాయి. యూఎస్‌ ఫెడ్‌ ఈ నెల 10న వడ్డీ రేట్లను తగ్గించనుందనే అంచనాలతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించా రు. భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి శుక్ర వారం ఒక్క పూటలోనే రూ.439 కోట్ల ను ఉపసంహరించుకోగా డిసెంబర్‌లో ఇప్పటి వరకు రూ.6,584 కోట్ల విలువైన స్టాక్స్‌ను తరలించుకుపోయారు. ఇది మార్కెట్లపై మరింత ఒత్తిడిని పెంచిందని నిపుణులు భావిస్తున్నారు. ఇండిగోలో నెలకొన్న సంక్షో భంతో దాని మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవి యేషన్‌ లిమిటెడ్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్లలో భారీగా క్షీణించాయి.. ఇప్పటికే గత ఐదు సెషన్లలో 9శాతానికి పైగా నష్టపోగా.. సోమవారం సెషన్‌లో ఏకంగా 8.28 శాతం లేదా రూ.444.75 నష్టంతో రూ.4,926.55 వద్ద ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -