Sunday, March 15, 2026
E-PAPER
Homeబీజినెస్రూ.53వేల కోట్ల ఎఫ్‌ఐఐలు పలాయనం

రూ.53వేల కోట్ల ఎఫ్‌ఐఐలు పలాయనం

- Advertisement -

ముంబయి : ఇరాన్‌పై అమెరికా యుద్ధోన్మాదం ఉద్రిక్తతలు భారత స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. మార్చి మొదటి పక్షం రోజుల్లోనే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) ఏకంగా రూ.52,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాదిలోనే అత్యధికంగా శుక్రవారం ఒక్కరోజే రూ.10,717 కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి. యుద్ధం 15వ రోజుకు చేరడం గ్లోబల్‌ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో విదేశీ పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతుండగా దేశీయ ఇన్వెస్టర్లు వరుస నష్టాలతో బెంబేలెత్తుతున్నారు. గడిచిన 13 సెషన్లలో దాదాపు రూ.33లక్షల కోట్ల సంపద హరించుకుపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో రానున్న వారం కూడా మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశం ఉందని ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది.
ఆర్థిక వ్యవస్థ పటిష్టం: బజాజ్‌ ఫిన్సర్వ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌
ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థ తన పటిష్టతను చాటుకుంటోందని బజాజ్‌ ఫిన్సర్వ్‌ అసెట్‌ మేనేజ్మెంట్‌ నివేదిక వెల్లడించింది. 2025-26 మూడో త్రైమాసికంలో నిఫ్టీ 500 లాభాలు 16 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఈ విస్తృత వృద్ధి ఈక్విటీ మార్కెట్లు భవిష్యత్తులో బలంగా ముందుకు సాగేందుకు దోహదపడుతుందని సంస్థ ఈక్విటీ హెడ్‌ సోర్భ్‌ గుప్తా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -