Monday, March 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమాద భరితంగా ఉన్న పురాతన బావిని పూడ్చండి

ప్రమాద భరితంగా ఉన్న పురాతన బావిని పూడ్చండి

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
ఉప్పునుంతల మండల కేంద్రంలోని పలకపల్లి రోడ్డు ఎస్సీ కాలనీలో ఇండ్ల మధ్యన ప్రమాద భరితంగా ఉన్న పురాతన చేదురు బావిని పూడ్చాలని కాలనీ ప్రజలు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో ఒక వ్యక్తి బావిలో పడ్డాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి క్షేమంగా బయటికి తీశారు. బావి పక్కలనే అంగన్వాడి కేంద్రం ఉంది. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అనుకోకుండా ప్రమాదం జరిగితే ప్రాణం నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాలనీలో పురాతన బావి నిరుపయోగంగా  ఉండడంతో చుట్టుపక్కల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. బావిని పూడ్చడం వల్ల పరిసరాలు పరిశుభ్రతతో పాటు ప్రత్యేకంగా రోడ్ సౌకర్యం ఏర్పడుతుందని కాలనీ ప్రజలు చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదం జరగక ముందే ముందు జాగ్రత్తగా పంచాయతీ అధికారులు, సర్పంచ్ స్పందించి బావిని పూడ్చాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -