డాక్టర్ ఎం.రాజీవ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలో రెండేళ్లలో అనేక పోస్టుల భర్తీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని టీపీసీసీ వైద్య, ఆరోగ్య విభాగం చైర్మెన్ డాక్టర్ ఎం.రాజీవ్ తెలిపారు. ఆదివారం కొంపల్లి ఐఎంఏ బ్రాంచ్ ఆధ్వర్యంలో రాజీవ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ మార్పు కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యం కలిగి ఉండాలనీ, సరైన నాయకులను ఎంచుకోవాలనీ, మంచి పనులు చేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. సమాజ సమస్యలపై మౌనం వీడి స్పందించాలని కోరారు. తనకు అవకాశం కల్పించిన మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్‌కు, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం, వైద్యుల పోరాటాలకు అండగా ఉంటూ వారి గౌరవాన్ని నిలబెడుతానని రాజీవ్ తెలిపారు. వైద్యుల ప్రతినిధిగా, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్‌గా రాజీవ్ అందించిన సేవలను ఐఎంఏ బ్రాంచ్ వైద్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ బి.వెంకటేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
పోస్టుల భర్తీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES