Monday, July 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాలనీల్లో వర్షపు నీటి గుంతల పూడ్చివేత

కాలనీల్లో వర్షపు నీటి గుంతల పూడ్చివేత

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ కాలనీల్లో వర్షపు నీటి గుంతలను సోమవారం గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా పూడ్చివేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా కాలనీలో ఏర్పడ్డ పెద్ద పెద్ద  గుంతల్లో వర్షపు నీరు మడుగులు కట్టాయి. దీంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడే ఆస్కారం ఉండడంతో గుంతల్ని పూడిచేందుకు  గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆయా కాలనీలో వర్షపు నీటి గుంతల్లో క్రషర్ నుండి డస్ట్ తెప్పించి గుంతల్లో పోయించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది డస్ట్ ను గుంతల్లో ఎత్తిపోసి చదును చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గంగా జమున మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గ్రామంలోని ఆయా కాలనీలో మురికి కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నట్లు తెలిపారు. మురుగునీటి గుంతల్లో దోమలు వృద్ధి చెందకుండా లార్వాను చంపేందుకు ఆయిల్ బాల్స్ వేయించడం లాంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు కూడా కమ్మర్ పల్లిని  పారిశుద్ధ్య గ్రామంగా నిలిపేందుకు సహకరించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -