నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని పెద్ద టాక్లి & సిర్పూర్ గ్రామాల మద్యలో గల బ్రిడ్జ్ కు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి గుంతలు ఏర్పడడం జరిగింది. భారీ గుంతల మూలంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడం వాహనదారులకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఇరు గ్రామాల మధ్య బ్రిడ్జి వద్ద ఏర్పడ్డ భారీ గుంతలను వెంటనే పూడ్చివేయాలని అధికారులకు ఆదేశించడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మొరం వేయించిప్రజల రవాణాకు ఇబ్బందిగా కలగకుండా రోడ్డు మరమ్మత్తులు చేయడం జరిగింది. సిర్పూర్, పెద్ద టాక్లి గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన వారు పెద్ద టాక్లి గ్రామ అధ్యక్షులు సాయలు గోండా, డోoగ్లీ మండల కోఆర్డినేటర్ విలాస్ గైక్వాడ్ ఆయా గ్రామాల ప్రజలు.
బ్రిడ్జి వద్ద గుంతలు పూడ్చివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES