Tuesday, September 16, 2025
E-PAPER
Homeసినిమాతెలంగాణలో సినిమాల నిర్మాణం ఇక సులభతరం..

తెలంగాణలో సినిమాల నిర్మాణం ఇక సులభతరం..

- Advertisement -

తెలంగాణా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ, వాటి చిత్రీకరణలకు కావాల్సిన పలు అనుమతులు, థియేటర్‌ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగాభివద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌ సైట్‌ రూపొందిస్తోంది. ఈ సులభతర అనుమతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్‌ సైట్‌ ‘ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ’ పై నేడు సంబంధిత శాఖలు, ఫిలిం ఇండిస్టీ ప్రతినిధులతో ప్రత్యేక వర్క్‌-షాప్‌ జరిగింది. బేగంపేట్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ వర్క్‌ షాప్‌కు తెలంగాణా ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు, తెలంగాణ ఎఫ్‌.డీ.సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి.హెచ్‌ ప్రియాంక, టూరిజం కార్పొరేషన్‌ ఎం.డీ వల్లూరు క్రాంతితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్ని రకాలుగా చేయూత నిస్తున్నారు. ఈ సదావకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉపయోగించు కోవాలని చెప్పారు. ‘ఫిలిమ్స్‌ ఇన్‌ తెలంగాణ’ వెబ్‌ సైట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే, వారి సినిమా నిర్మాణానికి కావాల్సిన లొకేషన్లు, కావాల్సిన అనుమతులు, సాంకేతిక విభాగాలు, టెక్నీషియన్లు, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న హౌటళ్లతో పాటు సంపూర్ణ సమాచారం పొందుపరుస్తున్నాం. అలాగే సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్‌ జారీ విధానాన్ని కూడా ఆన్‌లైన్‌ ద్వారా పొందే సులభతరం విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. త్వరలో ఈ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి అధికారికంగా లాంచ్‌ చేస్తారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -