Sunday, November 9, 2025
E-PAPER
Homeకరీంనగర్రాజన్న క్షేత్రంలో సినీ నటుల మొక్కులు..

రాజన్న క్షేత్రంలో సినీ నటుల మొక్కులు..

- Advertisement -

అఖండ-2 విజయం కోసం రచ్చ రవి ప్రత్యేక పూజలు..
నవతెలంగాణ – వేములవాడ

పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం సినీ ప్రముఖులు సందర్శించారు. స్థానిక సినీ నటుడు వారాల దేవయ్య సహకారంతో వెండి తెర హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రచ్చ రవి కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను నటిస్తున్న నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ-2 చిత్రం ఘన విజయం సాధించాలని రచ్చ రవి రాజన్న స్వామి, బద్ది పోచమ్మ తల్లి, భీమన్నకు మొక్కులు చెల్లించారు.

ఈ కార్యక్రమంలో సినీ నటుడు, విలన్ పాత్రదారి తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్టు యూనియన్ జాయింట్ సెక్రటరీ కె. రామ్ మోహన్ కూడా పాల్గొన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రాలను దర్శించిన సందర్భంగా వారాల దేవయ్య రచ్చ రవి, రామ్ మోహన్‌లను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -