Sunday, May 4, 2025
Homeరాష్ట్రీయంఅరుణకు తుదివీడ్కోలు

అరుణకు తుదివీడ్కోలు

- Advertisement -

– జాన్‌వెస్లీ, వి శ్రీనివాసరావు సహా పలువురి నివాళి
– హైదరాబాద్‌లో ముగిసిన అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) సీనియర్‌ నాయకులు సి అరుణ అంత్యక్రియలు శనివారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, సీనియర్‌ నాయకులు డిజి నరసింహారావు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలి కార్యదర్శి, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్‌, ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌, సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్‌ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అరుణ భౌతిక కాయానికి ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి పెనుమల్లి మధు, ఏపీ కార్యదర్శివర్గ సభ్యులు ఎవి నాగేశ్వరరావు, రాంభూపాల్‌, నాయకులు నరసింహారావు, ఐద్వా ఉమ్మడి ఏపీ కార్యదర్శి పి స్వరూపరాణి, ఐద్వా తెలంగాణ అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ అధ్యక్షులు పద్మ, కార్యదర్శి వరలక్ష్మి, సహాయ కార్యదర్శి షబానాబేగం, విమల, భవాని, లక్ష్మి, వెంకటమ్మ పూలమాలవేసి నివాళులర్పించారు. ఆమె భర్త సి సాంబిరెడ్డి, కుమారుడు సి అంజిరెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు అరుణ అంతిమయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి.
మల్లు లక్ష్మి సంతాపం
అరుణ మరణం పట్ల ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, ఉపాధ్యక్షులు కెఎన్‌ ఆశాలత సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అరుణ ఐద్వా నాయకులుగా మహిళల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. ఆమె జీవితం ఆదర్శమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -