నివాళులర్పించిన సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఇతర నాయకులు
గాంధీ వైద్య కళాశాలకు భౌతికకాయం అప్పగింత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అనారోగ్యంతో కన్నుమూసిన ఐద్వా సీనియర్ నాయకురాలు కంచి తాయారమ్మకు సీపీఐ(ఎం), ఐద్వా, ఇతర ప్రజా సంఘాల నేతలు, కుటుంబ సభ్యులు బుధవారం తుది వీడ్కోలు పలికారు. మంగళవారం హైదరాబాద్‌లోని సిటిజన్ ఆస్పత్రిలో ఆమె మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఆమె భౌతికకాయానికి సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ (ఎం) సిటీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎమ్.వెంకటేశ్, మాజీ కార్యదర్శి ఎమ్.శ్రీనివాస్, మేడ్చెల్ కార్యదర్శి సత్యం, సీనియర్ నాయకులు పీఎస్‌ఎన్ మూర్తి, ఆర్‌బీఐ నాయకులు నాగేశ్వరరావు, కేఎస్‌ఎన్ రాజు (ఎల్‌ఐసీ), శ్రీకాంత్, ఈశ్వరరావు (సీఐటీయూ), ఎమ్‌ఎన్ రెడ్డి (టాప్రా), నవతెలంగాణ ఎడిటర్ సుధాభాస్కర్, సీనియర్ జర్నలిస్టు జీ.రాజకుమారి తదితరులు నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్ నుంచి ఆమె అంతిమయాత్ర బయలుదేరి, ముషీరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి చేరుకుంది. అక్కడ ఉదయం 11.30 గంటలకు తాయారమ్మ భౌతికాకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య గాంధీ వైద్యకళాశాలకు అప్పగించారు.
తాయారమ్మకు తుది వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES