– అశ్వారావుపేట మున్సిపాల్టీలో రిజర్వేషన్లపై ఉత్కంఠ
– వార్డుల వారీ సామాజిక వర్గాలు ఉండే అవకాశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనుండటంతో, ఎన్నికల అధికారులు వార్డులు మరియు పోలింగ్ కేంద్రాల కేటాయింపులకు తుది రూపు ఇచ్చారు. అశ్వారావుపేట మున్సిపాల్టీలో మొత్తం 22 వార్డులకు 22 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. వార్డులు – పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సామాజిక కూర్పు స్పష్టంగా తేలింది. తాజా వివరాల ప్రకారం మొత్తం 22 వార్డుల్లో 16,850 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,084, స్త్రీలు 8,762, ఇతరులు 4 మంది ఉన్నారు.
వార్డు వారీగా ఓటర్లు,ఆయా వార్డుల్లో సామాజిక వర్గాల వివరాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.ఏ వార్డు ల్లో ఏ సామాజిక వర్గం ఓటర్లు అత్యధికంగా ఉన్నారో ఆ వివరాలు.
1వ వార్డు – 774 ఓటర్లు (బీసీ)
2వ వార్డు – 703 ఓటర్లు (ఎస్సీ – మాల)
3వ వార్డు – 780 ఓటర్లు (బీసీ)
4వ వార్డు – 689 ఓటర్లు (ముస్లిం మైనార్టీ, బీసీ)
5వ వార్డు – 735 ఓటర్లు (బీసీ, ముస్లిం మైనార్టీలు)
6వ వార్డు – 724 ఓటర్లు (ఓసీ, బీసీ)
7వ వార్డు – 655 ఓటర్లు (ఎస్సీ, ఓసీ)
8వ వార్డు – 851 ఓటర్లు (ఓసీ, బీసీ)
9వ వార్డు – 855 ఓటర్లు (బీసీ)
10వ వార్డు – 834 ఓటర్లు (బీసీ, మైనార్టీలు)
11వ వార్డు – 783 ఓటర్లు (బీసీ, ఓసీ, ఎస్సీ)
12వ వార్డు – 739 ఓటర్లు (బీసీ, ఓసీ)
13వ వార్డు – 781 ఓటర్లు (ఎస్సీ, బీసీ, ఓసీ)
14వ వార్డు – 740 ఓటర్లు (ఓసీ, బీసీ)
15వ వార్డు – 691 ఓటర్లు (బీసీ, ఓసీ)
16వ వార్డు – 772 ఓటర్లు (బీసీ, ఓసీ)
17వ వార్డు – 678 ఓటర్లు (బీసీలు అధికం)
18వ వార్డు – 767 ఓటర్లు (ఓసీ, ముస్లిం మైనార్టీలు)
19వ వార్డు – 831 ఓటర్లు (బీసీ, మైనార్టీలు)
20వ వార్డు – 831 ఓటర్లు (బీసీ)
21వ వార్డు – 793 ఓటర్లు (ఎస్సీ, ఓసీ)
22వ వార్డు – 844 ఓటర్లు (ఎస్సీ, ఓసీ)
ఈ కూర్పు నేపథ్యంలో ఏ వార్డు ఏ సామాజిక వర్గానికి రిజర్వ్ అవుతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా రిజర్వేషన్ ప్రకటన వెలువడిన తరువాతే స్పష్టత రానుంది.



