- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నిమిత్తం వార్డు వారీగా తుది ఓటరు జాబితాలు సిద్ధం చేసినట్టు మున్సిపల్ కమిషనర్ శ్రావణి సోమవారం తెలిపారు. ఈ ఓటరు జాబితాలు ప్రజల పరిశీలన కోసం మున్సిపాలిటీ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎంఆర్‌ఓ కార్యాలయం లలో నోటీస్ బోర్డులపై ఉంచినట్టు తెలిపారు. ప్రజలు ఆయా కార్యాలయాలను సందర్శించి తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవలసినది సూచించారు. ఈ అవకాశాన్ని మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన పౌరులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



