బ్రిటిష్ కాలంలో తమ వద్ద పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం 1881లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేసింది. దేశ స్వాతంత్య్రానంతరం 1972లో భారత ప్రభుత్వం పెన్షన్ చట్టాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. దేశంలోని రూ.75 లక్షల మందికి చెల్లించే పెన్షన్ సొమ్ము వారికందించే సౌకర్యాలను ప్రభుత్వాలు, బడ్జెట్‌కు దేశానికి భారంగా భావిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2025 జనవరిలో ఫైనాన్స్ బిల్-2025 పేరుతో దొడ్డిదోవన పెన్షన్ చెల్లింపులో కొత్త నిబంధనలతో కూడిన మార్పులు చేస్తూ బిల్లును పార్లమెంటులో తీసుకొచ్చి ఆమోదింప చేసుకుంది.
పెరుగుతున్న ధరలను నియంత్రించడం చేతకాని కేంద్ర ప్రభుత్వాలకు ప్రజల సౌకర్యాలను కుదించే ముఖ్యంగా సామాజిక హక్కులాంటి వాటితో పాటు పెన్షన్‌లో కోత విధించే అధికారం లేదు. పదవీ విర మణ పొందిన సమయంలోనే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు లాంటివి ఉత్పన్నమవుతాయి. అలాంటి సమయంలో పెన్షనర్లను ఆర్థికంగా ఆదుకోవటం అనేది ప్రభుత్వాల యొక్క కనీస సామా జిక బాధ్యత. దానిని విస్మరించటం క్షమించరాని నేరం. నలభై యేండ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ సేవలం దించిన ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వారికి చెల్లించే పెన్షన్‌లో పెరుగుదల లేకుండా బిల్లు తీసుకురావడం అత్యంత దారుణం. పదవీ విరమణ పొందిన రోజు ఆ నెలలో పొందే మూలవేతనంలో సగం చెల్లించే పెన్షన్‌తో జీవితాంతం ఎలాంటి ఎదుగుదల, పెరుగుదల లేకుండా చెల్లించడాన్ని, పొందడాన్ని 1982లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు, సహజ న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరు ద్ధరించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేసి ఉద్యమిస్తున్న సమయంలో ఇలాంటి తిరోగమన, దుర్మార్గమైన చర్యలకు ప్రభుత్వం పాల్పడటం అన్యాయమే కాదు ఆటవికం కూడా.
8వ పే కమిషన్ పెన్షన్ కోసం చేసిన సిఫార్సులు, భవిష్యత్ లో పదవీ విరమణ పొందిన వారికి మాత్రమే. అనగా 8వ పే కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. 8వ పే కమిషన్ సిఫార్సులు అమలు తేదీకి ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు 8వ పే కమిషన్ పెన్షన్ కొరకు చేసిన సిఫార్సులు, పెన్షన్ రివిజన్ వర్తించదు. ఫైనాన్స్ బిల్లు-2025తో పాటు తీసుకొచ్చిన ఈ పెన్షన్ చట్టం ద్వారా పెన్షనర్లను రెండు గ్రూపులుగా విభజిస్తున్నారు. 8వ పేకమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన పెన్షనర్లు, 8వ పే కమిషన్ సిఫార్సులు అమలు కాక ముం దు పదవీ విరమణ పొందిన పెన్షనర్లు అని వర్గీ కరణ చేసి, రెండు గ్రూపులుగా ఈ చట్టం ద్వారా విభజించారు. ఈ బిల్లు పూర్తిగా వివక్షతో కూడినది. ఇది పూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుకు అసమంజసమైనది. అనగా పెన్షన్ తో ఎలాంటి పెంపుదల ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం.
అలుపెరుగని పోరాటాలతో,ఆందోళనలతో ఉద్యోగులు, పెన్షనర్లు సాధించుకున్న హక్కును కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పోటుతో కాలరాయడమనేది దుర్మార్గం. ఇది ఒక్క కేంద్ర ప్రభు త్వ ఉద్యోగుల సమస్య కాదు. దేశంలోని కోట్లాదిమంది ఉద్యో గులు, పెన్షనర్లకు ఉరితాడుగా మారబోతోంది. 2025 మార్చి 25వ తేదీన లోక్‌సభలో ఆర్థిక బిల్లులో భాగంగా దొంగ చాటుగా పెన్షన్ ధృవీకరణ, వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆమోదింపచేసుకుంది. ప్రభుత్వ పెన్షనర్లుగా ఉన్న డి.ఎస్. నకారా తదితరులు పెన్షన్ చెల్లించాలని సుప్రీం కోర్టులో కేసు వేయగా 17 డిసెంబర్ 1982న చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. సిపిఎస్ పెన్షన్ రూల్స్ 1972 వర్తించే పెన్షన ర్లందరికీ వారు ఎప్పుడు రిటైర్ అయ్యారనే దానితో నిమిత్తం లేకుండా అందరికీ పెన్షన్ చెల్లించాలని డి.ఎస్. నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిటైరయిన వారి అందరికీ సమంగా పెన్షన్ చెల్లించాలని తీర్పునిచ్చి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనేక రూపాల్లో అధిక రాయితీలు చెల్లిస్తున్నది. భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 8వ వేతన కమిటీ సిఫార్సుల అమలు తర్వాత రిటైర్ అయిన పెన్ష నర్లతో సమంగా అమలుకు ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ రివిజన్ చేయుటకు సిద్ధంగా లేదు. పైగా సుప్రీంకోర్టు తీర్పులను వమ్ముచేసే విధంగా పెన్షనర్లకు సమా నంగా పెన్షన్ చెల్లించుటకు బదులు వర్గీకరణను చట్ట బద్ధం చేసి దాన్ని ధృవీకరణ చేయటానికి పూనుకున్నది. రిటై ర్మెంట్ తేదీ ప్రకారం పెన్షనర్లను వర్గీకరించే అధికారం ప్రభు త్వానికి ఉందని, పెన్షన్ రూల్స్ పేరుతో ఫైనాన్స్ బిల్లు- 2025 లో కొన్ని నిబంధనలను చేర్చి ఈ వర్గీకరణ చేయుటకు తనకు అధి కారం ఉందని ప్రతిపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఈ ఫైనాన్స్ బిల్లు-2025ను చట్టం రూపంలో మార్పు చేసు కున్నది. ఈ ఫైనాన్స్ బిల్లును తనకు గల మెజార్టీతో చట్టసభల్లో ఆమోదింపచేసుకుని రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పొందింది.
పెన్షనర్ల వర్గీకరణకు అనుకూలంగా చట్టం చేయాలను కుంటే అందుకు విడిగా ఒక బిల్లును ప్రవేశపెట్టి దానిపై చర్చిం చి పార్లమెంటు ఉభయసభల ఆమోదం పొందాలి. అటువంటి విషయాన్ని బడ్జెట్ క్రమంలో భాగమైన ఫైనాన్స్ బిల్లుల్లో ఎలా చేరుస్తారు? వర్గీకరణ బిల్లును విడిగా పార్లమెంట్‌లో చర్చకు పెడితే దానిపై చర్చించి ప్రతిపక్షాలు అలజడి చేస్తే బిల్లును వాయిదా వేయాల్సి వస్తుందని భావించినట్టుంది. అందుకే ఫైనాన్స్ బిల్లు-2025లో భాగంగా పెట్టి దొడ్డిదారిన పార్ల మెంట్ ఆమోదం పొందటం అన్యాయం. ఇదే విధంగా గతంలో ఎల్‌ఐసిలో వాటాల అమ్మకం కోసం దాన్ని మార్చేందుకు మోడీ ప్రభుత్వం 2021-ఫైనాన్స్ బిల్లులో భాగంగా చేర్చి పార్ల మెంట్‌లో ఆమోదం పొందింది. అదే విధంగా ఫైనాన్స్ బిల్లుకు సంబంధం లేని అనేక విషయాలను పార్లమెంట్‌లో తనకు గల భారీ మందబలంతో దుర్మార్గంగా ఆమోదింపచేసుకున్నది. ఆర్థిక మంత్రి, పెన్షన్ సెక్రటరీ ఈ వర్గీకరణ చట్టం వల్ల 8వ వేతన కమిటీ సిఫార్సుల అమలుకు ముందు రిటైర్ అయిన వారికి పెన్షన్ 8వ వేతన కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా, జరగకుండా ఉండమని పెన్షనర్లు ఆందోళన చెందవద్దని చెబుతున్నారు. అదే నిజమైతే ఈ వర్గీకరణ, ధృవీకరణ చట్టం ఎందుకు తీసుకొచ్చినట్టు?
సిసిఎస్ పెన్షన్ రూల్స్-1972 ప్రకారం పెన్షన్ తీసుకునే వారందరూ పెన్షనర్లే. సమానత్వం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుకు సంబంధించిన విషయాన్ని ఫైనాన్స్ బిల్లులో పెట్టి పార్లమెంట్ ఆమోదంతో చట్టంగా చేసినా, అది చెల్లుబాటు కాదు. అయినా కూడా మోడీ ప్రభుత్వం చట్టాన్ని దుర్మార్గంగా అమలుచేయ పూనుకున్నది. కార్పొరేట్లు, పెట్టుబడిదార్లు సంపద సష్టికర్తలని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నిధులలో ప్రజల సంక్షేమానికి కేటాయించిన నిధులను తగ్గించి కార్పొరేట్ల ప్రయో జనాల కోసం వినియోగించేందుకు అనుసరిస్తున్న వ్యూహంలో భాగమే ఇది.ఈ పెన్షన్ ధ్రువీకరణ బిల్లు కేవలం నలభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 75 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పరిమితం కాదు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు, బ్యాంక్, ఇన్సూరెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి కుటుంబాలు అంధకారంలోకి నెట్టబడతాయి.
ప్రస్తుతానికి, ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఉద్యోగుల పెన్షనర్ల సంఘాల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోలేదు. ఉద్యోగుల, పెన్షనర్ల నెత్తిన కత్తి ఇంకా వేలాడుతూనే ఉన్నది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకోవడానికి భవిష్యత్‌లో పెన్షనర్ల సామాజిక భద్రత కోసం ఈ ప్రమాదకరమైన దుర్మార్గమైన ఫైనాన్స్ బిల్లు- 2025 ను సంపూర్ణంగా రద్దు చేసేవరకు పెన్షనర్లు, ఉద్యోగులు, ఉద్య మించటం తప్ప మరో మార్గం లేదు. ఈ పోరాటం కేవలం పెన్ష నర్లే కాదు, సామాజిక భద్రతకు రాజ్యాంగం కల్పించిన హక్కు లను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్ 9490300867
పెన్షనర్ల మెడపై ‘ఫైనాన్స్ బిల్లు-2025’ కత్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES