Friday, January 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారి చదువు కోసం ఆర్థిక సహాయం 

చిన్నారి చదువు కోసం ఆర్థిక సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన సిరికొండ నర్సయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నర్సయ్య తన కూతురిని చదివించుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సిరికొండ నర్సయ్య కూతురి చదువుల నిమిత్తం టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ రూ.10వేల ఆర్ధిక సహాయాన్ని అందించారు.

ఆర్థిక సహాయం మొత్తాన్ని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేటరవి చేతులమీదుగా నర్సయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ కూతురి చదువు కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ కు బాధ్యత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రఫీ, గ్రామస్తులు దశరత్, భూమారెడ్డి, పుప్పాల నర్సయ్య, రమేశ్, నందు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -