Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొహర్రం ఉత్సవాలకు ఆర్థిక సహాయం

మొహర్రం ఉత్సవాలకు ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే మొహర్రం ఉత్సవాలకు బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. మండలంలోని వెంకటేశ్వర పల్లి గ్రామంలో ముస్లిం సోదరులు అంగరంగ వైభవ నిర్వహించుకుంటున్న మొహర్రం ఉత్సవాలకు శ్రీనివాస్ రెడ్డి రూ ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఉత్సవంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని సోదర భావాన్ని చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ కో- ఆర్డినేటర్స్ ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, ఎండీ యూసఫ్, దోకుడు దేవేందర్, గూబ ఎల్లయ్య, గూబ అశోక్, చిలువేరు సాయి గౌడ్, యకమచారీ, సామ్రాట్, పొన్నం సతీష్, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -