Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ అభివృద్ధికి ఆర్థిక చేయూత

ఆలయ అభివృద్ధికి ఆర్థిక చేయూత

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని కోనాపూర్ గ్రామంలో రాళ్ళవాగు ప్రాజెక్టును ఆనుకొని స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతుగా గ్రామానికి చెందిన టేకుల సంజీవ్-అవంతి దంపతులు ఆర్థికంగా చేయూత అందించారు. ఈ మేరకు శనివారం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులను తమ స్వగృహానికి ఆహ్వానించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం గుడి కట్టడానికి కావలిసింత బెట్ రాయి అందించేందుకు కావలసిన మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో ఇంకా అవసరమైతే  కూడా ఆ మొత్తాన్ని కూడా అందిస్తామని ఈ సందర్భంగా టేకుల సంజీవ్-అవంతి దంపతులు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ మాట్లాడుతూ గ్రామంలో స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపముగా దర్శనమివ్వడం  కోనాపూర్ ప్రజలు ఎన్నో జన్మల చేసిన పుణ్యఫలంగా పేర్కొన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు గుడి నిర్మించాలన్న సంకల్పంతో అందరం స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగిందన్నారు. కొనపూర్ గ్రామ ప్రజలు తోచిన విధంగా ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికి ఆర్థికంగా చేయూతను అందించిన టేకుల సంజీవ్-అవంతి దంపతులకు, వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోనాపూర్ గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చిలువేరి  లక్ష్మీనారాయణ, అంజయ్య, రమేష్, మహేష్, నరేష్, గంగారెడ్డి, పురుషోత్తం, రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -