నవతెలంగాణ – జడ్చర్ల: ప్రస్తుత సమాజంలో అన్న, తమ్ముడు, అక్క, చెల్లి రక్త సంబంధాలు ఉన్నవాళ్లు కూడా ఆపదలో ఉంటే చూసి నవ్వుకునే వారే కానీ సహాయం చేయడానికి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి ఈ రోజుల్లో రాయికల్ గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి పది రోజుల క్రితం అకస్మాత్తుగా చనిపోయారు. ఈ నేపథ్యంలో రాఘవేందర్ రెడ్డి కుటుంబాన్ని 1993 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు కిష్టారం గోపాల్ రెడ్డి, పోలేపల్లి బాలసామి గౌడ్, ఆర్టీసీ రవి, దేవేందర్, రాయపల్లి రాంరెడ్డి, నర్సింలు గౌడ్, సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్, మాచారం వెంకట్రెడ్డి, వారి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ పరిస్థిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా తమవంతు సహాయంగా రూ.46 వేలను కుటుంబానికి అందజేశారు. అంతే కాకుండా భవిష్యత్తులో పిల్లల చదువులకు ఏమైనా ఆర్థిక సహాయం అవసరం అయితే మా యొక్క మిత్రబృందం తరఫున సహాయం అందిస్తామని హామీ ఇచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పారు. రాఘవేందర్ రెడ్డి చాలా మంచివాడు, అందరితో కలిసిమెలిసి ఉండేవాడని నాటి జ్ఞాపకాలను మరోసారి నెమరువేసుకున్నారు.
బాధిత కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES