Tuesday, November 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ పారిశుద్ధ కార్మికుని కూతురు పెళ్లికి ఆర్థిక సాయం అందజేత

మున్సిపల్ పారిశుద్ధ కార్మికుని కూతురు పెళ్లికి ఆర్థిక సాయం అందజేత

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
మున్సిపల్ పారిశుద్ధ కార్మికుని కూతురు పెళ్లికి టిపిసిసి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ లో పనిచేస్తున్నటువంటి పరిశుద్ధకార్మికుడు షేక్ మహబూబ్ కూతురి పెళ్లి  సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబానికి పెళ్లి కానుకగా రూ.40 వేలు అందించారని పారిశుద్ధ కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, సాయి బాబా, మున్సిపల్ యూనియన్ లీడర్లు ప్రభాకర్, ఆనంద్, ప్రభు, జ్యోతి, దీవెన తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -