నవతెలంగాణ – మునుగోడు
మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు పార్వతమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి సహకారంతో శుక్రవారం వైస్ చైర్మన్ ,కొంపల్లి ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి పార్వతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్వతమ్మ కుటుంబానికి వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మలదశరథ, వార్డు నెంబర్లు జీడిమడ్ల ఇందిరమ్మ, జీడిమడ్ల మౌనిక, బోయపర్తి ప్రసాద్, జాల నర్సింహ, యాదగిరి రెడ్డి, జీడిమడ్ల వెంకటయ్య, బోయపర్తి లింగయ్య, సంకు శంకర్, మొగుదాల శివ, బోయపర్తి గణేష్, మొగుదాల శంభు గౌడ్, జీడిమడ్ల శంకర్, వడ్డేపల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



