Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం 

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన పిట్టల నరేష్ (32) ఇటీవల విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. విషయం తెలుసుకున్న మృతుడి చిన్ననాటి స్నేహితులు తలా కొంత మొత్తాన్ని జమచేసి రూ. 10 ఆయన భార్య శిరీష కు అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నరేష్ తో ఉన్నటువంటి జ్ఞాపకాలను స్మరించుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కాగా నరేష్ కు ఇద్దరు పిల్లలు సంతానం. ఆర్థిక సహాయం అందించిన వారిలో ఆవుల మహేష్, కాదునూరి నాగరాజు, బానోత్ జైపాల్, పులుగుజ్జ శంతన్, ఆకుతోట ప్రశాంత్, కందుల మహేందర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -