- Advertisement -
నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలకేంద్రానికి చెందిన బొప్పరపు అశోక్ అనే వ్యక్తి ఇటీవలే పురుగుల మందు తాగి మృతి చెందారు. ఈ నేపథ్యంలో అయన కుటుంబానికి 2003-04 సంవత్సరం కి చెందిన పదో తరగతి చిన్న నాటి స్నేహితులు మృతుని భార్య సుచరిత కు రూ.35వేలు సోమవారం ఆర్థిక చేయూతను అందించారు. ఈ సందర్బంగా ఆమె పేరు మీద బ్యాంకులో రూ.35 వేలు పిక్స్ డిపాజిట్ చేసి ఆహా పత్రంను ఆమెకు అందించారు. రానున్న కాలం లో పిల్లల భవిష్యత్తు కోసం ఈ చేయూత తొడ్పాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్రులు కొంగర్ల గణేష్, గుంజాల లక్ష్మణ్, నరేష్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
- Advertisement -