Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని కోనసముందర్ గ్రామానికి చెందిన ప్రదీప్ ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోయి మృతి చెందాడు. మృతుడిది నిరుపేద కుటుంబం కావడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన మృతుడు ప్రదీప్ కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా పంపించారు. ఈ మేరకు శనివారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మృతుని ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం మొత్తాన్ని  అందజేశారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైడి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -