- Advertisement -
నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త మాతంగి భాగ్యలక్ష్మి ఇటీవల మరణించారు. ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు, శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) వైద్య అధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది, తోటి ఆశా కార్యకర్తలు తమ గొప్ప మనసును చాటుకున్నారు.వారంతా కలిసి సమష్టిగా రూ.51,500 విరాళాన్ని సేకరించి, భాగ్యలక్ష్మి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సహాయం మాతంగి భాగ్యలక్ష్మి కుటుంబానికి కొంతమేర ఊరటనిస్తుందని, ఆపత్కాలంలో వారికి అండగా నిలిచేందుకు తోడ్పడుతుందని డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -