మృతుడు జర్నలిస్టు మద్దెల శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటాం
నెల్లికుదురు మండల జర్నలిస్టులు
నవతెలంగాణ – నెల్లికుదురు
ఇటీవల కన్ను మూసిన మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు మద్దెల శ్రీనివాస్ కుటుంబాన్ని నెల్లికుదురు మండల జర్నలిస్టులు మంగళవారం పరామర్శించారు. శ్రీనివాస్ చిత్రపటం వద్ద నివాళులర్పించి సంతాప వ్యక్తం తెలిపారు. సహచర రిపోర్టర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మండల జర్నలిస్టులు బొడ్డు అశోక్, పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ పంజాల వాసుదేవ గౌడ్, మల్యాల నరసయ్య, బొలగాని యాకయ్య గౌడ్, గొల్లపల్లి విజయ్ బాబు, మద్ది వెంకటేశ్వర్లు, హెచ్చు మహేందర్, బైరు శ్రీనివాస్, మస్కపురి కుమార్, మస్కపురి సుధాకర్, పోరండ్ల లక్ష్మయ్య, సింగరం ప్రసాద్, సిరబోయిన జగన్ యాదవ్, చెదలయకాంతం, గుగులోతు నగేష్, పెరుమాడ్ల రమేష్, జిలకర శ్రీధర్ రూ.20,000 ఆర్థిక సహాయం శ్రీనివాస్ కుమారుడు జీవన్ కు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. మృతి చెందిన జర్నలిస్టు మధ్యల శ్రీనివాస్ మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వార్త రూపంలో శ్రమించే వ్యక్తిని అన్నారు. అంతేకాకుండా అతను అంతకుముందు ఉపాధ్యాయ వృత్తిలో ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయ వృత్తిగా నిర్వహించి ఎంతోమంది పిల్లలను విద్యావంతులను చేసి ఉన్నంత స్థాయికి ఎదిగించేందుకు ఎంతో చేసిన వ్యక్తి అని అన్నారు. గ్రామంలో కూడా అందరితో మంచి ఆలోచనతో ముందుకు నడిచే వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి నేడు మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు ఆ కుటుంబానికి ఎప్పుడైనా అండగా నెల్లికుదురు జర్నలిస్టులు అండగా ఉంటారని తెలిపారు.



