Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అనాధ పిల్లలకు అర్థిక సహాయం

అనాధ పిల్లలకు అర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ 
మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు అదే గ్రామానికి చెందిన ఆస్కార్ యూత్ సభ్యులు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ పరసొల్ల సత్తెమ్మ ఇటీవల క్యాన్సర్ తో మృతి చెందినదనీ, ఆమె భర్త దుబాయిలో గల్లంతు కావడం జరిగిందనీ తెలిపారు. నానమ్మ తతయ్యాల వద్ద  ఇద్దరు కుమారులు ఉంటున్నారు. వారికి చేదోడు వాదోడుగా ఆస్కార్ యూత్ సభ్యులు రూ. 12500 అర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ యూత్ సభ్యులు రాజు, రాజేందర్, సుమన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -