పడమటి గడ్డ తండా గ్రామపంచాయతీలో ఫ్రెండ్లీ డొనేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.2216 ఆర్థిక సాయం
ఫ్రెండ్లీ డొనేషన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గుగులోతు భాస్కర్ నాయక్
నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని మేచరాజుపల్లి గ్రామ శివారు పడమటి గడ్డ తండ లో నిరుపేద కుటుంబం ఆయన ధర్మసోతు వెంకన్న తారమ్మ ద్వితీయ పుత్రిక అయిన ధర్మసోతు రేణుక పెళ్లి సందర్భంగా ఆ గ్రామానికి చెందిన ఫ్రెండ్లీ డొనేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.2216/- అందించినట్లు ఆ సంస్థ నాయకులు గుగులోతు భాస్కర్ నాయక్ బాధ వద్దు బాలు నాయక్ లు తెలిపారు. ఆదివారం ఫ్రెండ్లీ డొనేషన్ సభ్యులు ఘనంగా వివాహన్ని జరిపించే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి వారి సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు. అవసరమైతే వారికి మా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని తెలిపారు. ఈ తండాలో ప్రతి కుటుంబం అభివృద్ధి పదంలో నడిచేందుకు ఈ ఫ్రెండ్లీ డొనేషన్ సంస్థ ముందు ఉంటుందని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే అదృష్టంగా భావిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తండ నాయకులు గుగులోతూ భాస్కర్ నాయక్ బాధవత్ బాలు నాయక్ గుగులోతు శ్రీను ,రామవతు చంద్రశేఖర్ ధర్మశాతు వెంకన్న, శ్రీను ,సైదులు ,గుగులోతు వెంకన్న ,గొడుగు వెంకన్న పాల్గొన్నారు.



