Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాంసాగర్ పాఠశాలకు ఆర్థిక చేయూత

రాంసాగర్ పాఠశాలకు ఆర్థిక చేయూత

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్ 
రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాండ్ బహుకరణ చేయడం జరిగిందని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జి. రాజ్ కుమార్, ఆర్థిక చేయూత ఫౌండేషన్ సభ్యులు పి.రమేష్, స్వామి, డి. రమేష్ లు తెలిపారు. మంగళవారం రాయపోల్ మండలం రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాండ్ అందజేశారు.

విద్యార్థుల్లో సాంస్కృతిక, దేశభక్తి భావాలను పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవసరమని వారు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత పాఠశాల విద్యార్థులకు ఇలాంటి సహాయ సహకారాలు ఎంతో ఉపయోగకరమని, ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -