– వ్యాపారాలు నిర్వహణకు నిర్ధిష్ట ప్రదేశాలు
– వీధి కుక్కలు,వీధి పశువులు నియంత్రణకు చర్యలు
– కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ పరిధిలో వీధి వ్యాపారులను గుర్తించి బ్యాంక్ లింకేజీ ఆర్ధిక చేయూత కల్పిస్తామని కమీషనర్ నాగరాజు తెలిపారు. 100 రోజుల కార్యాచరణ లో భాగంగా శుక్రవారం తన కార్యాలయం లో సీఐ నాగరాజు సమక్షంలో వీధి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. పుట్టిన వ్యాపారుల కమిటీ నియమించి చిరు వ్యాపారులను గ్రూపులుగా ఏర్పాటు చేసి అర్హులైన వ్యాపారులకు తక్కువ వడ్డీ తో బ్యాంక్ ల ద్వారా రూ.10 వేలు ఆర్ధిక చేయూతనిస్తాం అన్నారు.
వీధి వ్యాపారులు వ్యాపారాలు నిర్వహించడానికి నిర్ధిష్ట ప్రదేశాలు,నిర్ణీత సమయాలు నిర్ణయిస్తామని అన్నారు.రద్దీ ప్రదేశాలను రెడ్ జోన్ గా,నిర్ధిష్ట సమయాల్లో వ్యాపారాలు నిర్వహించే ప్రదేశాన్ని అంబ్రిల్లా,సాదారణ వ్యాపారాలు నిర్వహించే ప్రదేశాన్ని గ్రీన్ జోన్ గా వ్యవహరిస్తామని తెలిపారు. వీధి కుక్కలు,పశువుల నియంత్రణ పై చర్యలు చేపడతామని,రోడ్ల వెంట విడిచిపెట్టే పశువుల యజమానులు పై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ సమావేశంలో టీపీఓ శ్రీనివాస్,టీఎంసీ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.