Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
బాధిత కుటుంబానికి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దికుంట నర్సగౌడ్ స్పందించి బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన పుల్లూరు వెంకటేష్ గత 4 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని, బాధిత కుటుంబానికి రూ.3000, 50 కేజీల బియ్యాన్ని అందజేశామని, పేదవారికోసం సహాయం చేయడంలో సంతోషం ఉందని అన్నారు. బాధిత కుటుంబం, గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సల్మాన్, స్వామి గౌడ్, దేవదాసు, బాల నర్సు, రవి నాయక్, మైసా గౌడ్, తలారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -