బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

నవతెలంగాణ-భిక్కనూర్: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో అనారోగ్యం కారణంగా జిట్ట శాంతమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నేనున్నాను అంటూ భరోసాతో శాంతమ్మ కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సి డి సి డైరెక్టర్ మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వామి, సొసైటీ వైస్ చైర్మన్ స్వామి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధరామ్ రెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, నాయకులు బాలా గౌడ్, రవి, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Spread the love