Friday, July 31, 2026
E-PAPER
Homeఆటలుచిత్రలేఖనంలో అమితాష్‌కు ప్రథమ స్థానం

చిత్రలేఖనంలో అమితాష్‌కు ప్రథమ స్థానం

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్‌
రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో డీపీఎస్‌ కొల్లూరు విద్యార్థి అమితాష్‌ చటర్జీకి ప్రథమ స్థానం లభించింది. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో డ్రాయింగ్‌ అండ్‌ పెయింటింగ్‌ జూనియర్‌ కేటగిరీ ప్రైవేట్‌ స్కూల్స్‌ విభాగంలో అమితాష్‌ విజేతగా నిలిచాడు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదగా అమితాష్‌ ప్రశంసాపత్రం, పతకం, ట్రోఫీ అందుకున్నాడు. అమితాష్‌ను డీపీఎస్‌ కొల్లూరు విద్యాసంస్థ సెక్రటరీ పవన కుమార్‌ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -