Thursday, July 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన

ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన

- Advertisement -

సుమంత్‌ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’. రాజేశ్‌ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్‌ నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు. హీరో సుమంత్ మాట్లాడుతూ,’ఇది కొత్త తరహా థ్రిల్లర్ అయినప్పటికీ, ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. నేను కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యానో, సినిమా చూస్తున్నప్పుడు కూడా అంతే ఎగ్జైటింగ్‌గా అనిపించింది. రాజేష్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో అన్ని పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ప్రీమియర్స్‌కు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్‌పై ప్రశంసలు వచ్చాయి. అందుకు మా నిర్మాతలకు, ఈటీవీ విన్‌కు థ్యాంక్స్. మంచి సినిమా చేశాం. ఇది ఫ్యామిలీ డ్రామాతో కూడిన చాలా డిఫరెంట్ థ్రిల్లర్. మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. మన సంస్కృతికి సంబంధించిన అంశాలను, క్యారెక్టర్లను సింబలైజ్ చేస్తూ ఈ సినిమా తీశారు. ఆ అందాన్ని మీరు థియేటర్‌లో చూస్తారు. తప్పకుండా ఈ సినిమాను సపోర్ట్ చేయండి. ఈ సినిమా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచదు` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -