Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదో తరగతి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

పదో తరగతి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
మండలంలోని కామారం గ్రామానికి చెందిన నెల్లుట్ల గోవర్ధన్ అనారోగ్యంతో మృతి చెందారు‌. ఆయన మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. పదో తరగతి (1996–97 బ్యాచ్) చెందిన మిత్రులు గోవర్ధన్ స్మృతిలో శ్రద్ధాంజలి అర్పించి, ఆయన కుటుంబానికి అండగా మేము ఉంటామని ముందుకు వచ్చి ధైర్యం చెప్పారు. గోవర్ధన్ పిల్లల భవిష్యత్తు కోసం రూ.50,000 పోస్టాఫీస్ బాండ్లు అందజేశారు. గోవర్ధన్ కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థులు స్నేహబంధం చిరస్థాయిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాల్య మిత్ర బృందం పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -