- Advertisement -
నవతెలంగాణ – ముధోల్: మండల కేంద్రమైనా ముధోల్ కు చెందిన యండిఅజార్ అనే వ్యక్తి ఇటీవల కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్ సోమవారం ముధోల్ లోని బాధిత కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆనంతరం యండి అజార్ కుటుంబం కు అండగా ఉండాలనే ఉదేశ్యంతో మృతుని కుటుంబం కు మోహన్ రావ్ పటేల్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో లో ముధోల్ మాజీ ఎంపీపీ జాధవ్ సుభాష్ పటేల్, ఏజాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -