నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి గ్రామానికి చెందిన మెంతని గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శనివారం బీరెల్లి మాజీ సర్పంచ్ జాజ చంద్రం బిఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీ చైర్మన్ నాగజ్యోతి ఆదేశాల మేరకు స్థానిక బి ఆర్ ఎస్ శ్రేణులతో కలిసి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ. 5,500 నగదు, 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంతన గంగమ్మ చాలా మంచివారిని మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు. వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పోగు నాగేష్, బీరెల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు దాయ రోషన్న, పార్టీ సీనియర్ నాయకులు బాగే రాములు, బెజ్జూరి శ్రీకాంత్, మోరే నరసింగరావు, గడదాసు శ్రీను, బాసాని రామకృష్ణ, నూశెట్టి లక్ష్మణ్, కార్యకర్తలు మెంతని( గడ్డం) సమ్మాలు, రాములు, మల్లయ్య, వినోద్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES