- Advertisement -
నూతన సర్పంచ్ పచ్చిక దిలీప్ రెడ్డి
నవతెలంగాణ – టేకుమట్ల
మండలంలో గర్మిళ్లపళ్లి గ్రామానికి చెందిన నిడిగొండ రాజమ్మ ఇటీవల మరణించగా గురువారం గర్మిళ్లపల్లి గ్రామ సర్పంచ్ పచ్చిక దిలీప్ రెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ నల్లవెల్లి మొండయ్య ,వార్డు సభ్యుల అచ్చే సుధాకర్, దొడ్ల తిరుపతి,సలిగంటి సంపత్, ఏకలవ్య సంఘం భూపాలపల్లి జిల్లా బాధ్యులు మానుపాటి సదయ్య పాల్గొన్నారు.
- Advertisement -



