Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైదులు కుటుంబానికి ఆర్థిక సహాయం

సైదులు కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందినపోషవోని చంద్రయ్య కుమారుడైన పోషవోని సైదులు గత కొద్ద రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా  తెలుసుకొని గ్రామ పంచాయతీ పాలకవర్గం బాధిత కుటుంబానికి రూ.6000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమావత్ ప్రమీల శ్రీకాంత్,, ఉప సర్పంచ్ దేవన బోయిన సత్యం, పంచాయతీ వార్డు సభ్యులు వీరబోయిన షామిని వెంకటయ్య, బుడిగ పాక లక్ష్మయ్య, బుడిగపాక సత్యనారాయణ, వీరబోయిన అంజి, కంభంపాటి అంజి, ఆకనబోయిన రాము, బొడ్డుపల్లి రామలింగం, మోర మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -