నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన గుంటి హోటల్ మల్లయ్య సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసుకున్న జగన్ యువసేన సభ్యులు బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూతను అందించారు. ఈ మేరకు సోమవారం బాధ్యత కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ యువసేన సభ్యులు రూ.5వేల నగదు ఆర్థిక సహాయంతో పాటు 25కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జగన్ యువసేన సభ్యులు మాట్లాడుతూ నిరుపేదలకు జగన్ యువసేన ఎల్లవేళల అండగా ఉంటుందని తెలిపారు. తమ కుటుంబా ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ఆర్థిక చేయూతనందించిన జగన్ యువసేన సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగన్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



