Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్ )ఆర్మూర్
మండల కేంద్రానికి చెందిన టికాయి బాలేష్  కూతురు టికాయి ఆద్విక కిడ్నీ సమస్యతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రి లో అడ్మిట్ అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసినారు. పాప ఆరోగ్యం బాగుపడాలంటే రూ.10 లక్షలు అవసరం అని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడం వల్ల ఇప్పటికే రూ.5 లక్షలు ఖర్చు చేశారు. ఇక వారితో వైద్యానికి డబ్బు లేదు. చేసేదేమీ లేక సహాయం చేసే వారికోసం పత్రిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. 

సమస్యను తెలుసుకున్న వేల్పూర్ కు చెందిన హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరఫున బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. దాతలు ఎవరైనా ఉంటే ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్  సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో  వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -