Monday, April 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌ యుద్ధంతో అమెరికన్లకు ఆర్థిక కష్టాలు

ఇరాన్‌ యుద్ధంతో అమెరికన్లకు ఆర్థిక కష్టాలు

- Advertisement -

దుర్భరంగా ప్రజల జీవితాలు
మార్ట్‌గేజ్‌ ఖర్చులు, ఆటో-క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు తడిసి మోపెడు

ఇరాన్‌ యుద్ధం అమెరికా ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చింది. మార్ట్‌గేజ్‌ ఖర్చులు, ఆటో-క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో ఆమెరికన్ల రోజువారీ జీవనం ఖరీదైనదిగా మారుతోంది. యుద్ధం మొదలైన తర్వాత మార్ట్‌గేజ్‌ రేటు (గృహ రుణాల కోసం రుణదాతలు విధించే వడ్డీ రేటు. మొత్తం రుణంలో ఇది ఒక శాతంగా ఉంటుంది) వరుసగా ఐదో వారంలో కూడా పెరిగింది. అయితే ఈ వారంలో కొంతమేర దిగివచ్చి 6.37 శాతానికి చేరింది. కొద్ది వారాల క్రితం వరకూ అమెరికాలో రుణాలు సులభంగా, చాలా చౌకగా లభించేవి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడి చేయడానికి రెండు రోజుల ముందు వరకూ 30 సంవత్సరాల సగటు మార్ట్‌గేజ్‌ రేటు 5.98 శాతంగా ఉండేది. కానీ ఈ వారంలో అది 6.37 శాతంగా ఉంది. పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం భయంతో వడ్డీ రేటును పెంచేస్తున్నారు. చమురు ధరలు పెరగడం, యుద్ధంపై అమెరికా చేస్తున్న వ్యయం కూడా పెరిగిపోవడం వంటి పరిణామాలు వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఇరాన్‌తో యుద్ధం దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఇన్వెసర్లు అభిప్రాయపడ్దారు. చమురు సరఫరాలకు సుదీర్ఘ కాలం ఆటంకాలు ఏర్పడిన పక్షంలో ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరిగిపోతాయి. ఇక ఇరాన్‌ యుద్ధం తో అమెరికన్లకు ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. సగటు గ్యాస్‌ ధరలు మార్చిలోనే నాలుగు డాలర్లకు చేరాయి. ఇంధన ధరలలో పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్లకు కుదిపే సింది. స్టాక్స్‌ నుంచి బాండ్లు, బంగారం, కరెన్సీల వరకూ అన్నింటి పైన ప్రభావం పడింది. దీంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు మదుపుదారులు ఇబ్బంది పడుతున్నారు. షిప్పింగ్‌ ఖర్చులు పెరగడంతో అమెరికా లోనూ, ఇతర దేశాలలోనూ ఆహార ధరలు పెరుగుతు న్నాయి. ఎరువుల కొరత కారణంగా పంటల ఉత్పాదక వ్యయం తడిసిమోపెడవుతోంది. డీజిల్‌ ధరలు పెరగడం తో బీమా, షిప్పింగ్‌ కంపెనీలు సర్‌ఛార్జ్‌ విధిస్తున్నాయి. జెట్‌ ఇంధన ధరలు పెరగడంతో విమాన ప్రమాణం కూడా తలకు మించిన భారమే అవుతోంది. ప్రయాణ మార్గాలలో మార్పులు, భద్రతా సంబంధమైన సమస్యలు వంటివి పర్యాటక పరిశ్రమను దెబ్బతీస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -