నవతెలంగాణ – వెల్దండ
పేద ప్రజలకు సీఎం సహాయనిది ఆర్థిక భరోసా కల్పిస్తుందని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశవల్ల కృష్ణ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెద్దాపూర్ పంచాయితీ తుంకిబండ తండాకు చెందిన వ్యర్త్యావత్ రాములు నాయక్ పేరిట మంజూరైన రూ.24 వేల సీఎం సహాయ మీరు చెక్కును లబ్ధిదారునికి అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామపంచాయతీకి చెందిన పలువురికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో లక్ష్మారెడ్డి, ల ఆంజనేయులు, శ్రీను, సేవ్య నాయక్, ప్రవీణ్ నాయక్, రవినాయక్, బాలునాయక్, రమేష్ నాయక్, హర్యానాయక్,దేవ్ సింగ్, కేశ్యనాయక్, కాటిక రాములు, బాలయ్య, మాడ్గుల వెంకటయ్య, శివ ధనుసు, హరిలాల్ నాయక్, తిరుపతినాయక్, సుధాకర్, వెంకటేష్, అనిల్ కుమార్, అజార్, విజయ్, జగన్,శివ,ప్రకాష్, ప్రశాంత్, చింటూ,తదితరులు పాల్గొన్నారు.